ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీ విజేతగా ఇండియా A నిలిచింది. ఇండియా Cతో జరిగిన మ్యాచులో 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో రెండు విజయాలతో అగ్రస్థానంలోకి దూసుకొచ్చిన ఇండియా A టైటిల్ సొంతం చేసుకుంది. 350 పరుగుల లక్ష్యంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా C 217 పరుగులకు ఆలౌటైంది. ఇండియా A తొలి ఇన్నింగ్స్లో 297 పరుగులు.. రెండో ఇన్నింగ్స్లో 286 పరుగులు చేసింది.