PLD: నరసరావుపేట పట్టణంలోని భువనచంద్ర టౌన్ హాల్లో బుధవారం పల్నాడు జిల్లా మహానాడు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. ఈనెల 27, 28, 29 తేదీల్లో టీడీపీ నిర్వహించే మహానాడు కార్యక్రమానికి జిల్లా నుండి భారీగా ప్రజల తరలి రావాలన్నారు. ప్రజల అభ్యున్నతికి ప్రజా ప్రతినిధులందరం కట్టుబడి ఉన్నామని తెలిపారు.