BPT: పంగులూరు మండలం జాగర్లమూడి వారి పాలెం రహదారి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. గుంటూరు నుంచి ఒంగోలు వెళుతున్న కారు డ్రైవర్ తాటి ముంజలు కొనేందుకు రోడ్డు పక్కన ఆపగా, వెనుక నుంచి వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, తాటి ముంజలు అమ్మే వ్యక్తి మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యప్తు చేపట్టారు.