PLD: వినుకొండ లోని గంగుపల్లి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం కురిసిన వర్షానికి బిళ్ళవాగు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు కోతకు గురైంది. దీంతో ప్రయాణికులు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.