WPL-3లో భాగంగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత యూపీ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. కిరణ్ నవ్‌గిరే (51) అర్ధ శతకం చేసింది. ఈ లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మెగ్ లానింగ్ (69), అన్నాబెల్ సదర్లాండ్ (41) రాణించారు.