ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. కేవలం 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 2 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు. సిక్సర్‌తో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తీ చేసుకోవడం విశేషం. 10 ఓవర్లు ముగిసేసరికి RCB.. 100/2 పరుగులు చేసింది. పటీదార్ 3, కోహ్లీ 53 పరుగులతో క్రీజులో ఉన్నారు.