HNK: గుట్కా, అంబర్ విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హనుమకొండ సీఐ శివ కుమార్ అన్నారు. నయీంనగర్‌లోని ఓ కిరాణ షాపులో పోలీసులు ఆదివారం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో రూ. 4,500 విలువైన పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని నిందితుడు మహేందర్‌పై కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.