VSP: గాజువాక 65వ వార్డు గరుడాద్రి కొండపై వెలసిన శ్రీదేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ ఛైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో తొలి ఏకాదశి పూజా కార్యక్రమాలు జరిగాయి. వేద పండితులు చామర్తి శ్రీనివాసాచార్యులు చేతుల మీదుగా తులసి పూజ, అభిషేకాలు చేశారు. తొలి ఏకాదశి అనగా స్వామి నిద్రించే రోజు, దీనిని శయన ఏకాదశి అని అంటారు.