MDK: పేద ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని నర్సాపూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. నర్సాపూర్ మండలం అజమర్రి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పనులను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చందుకే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు.