CTR: తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా చిత్తూరు పార్లమెంటు ప్రజలకు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు శుభాకాంక్షలు తెలిపారు. మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే ఈ పవిత్ర దినాన, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటునట్లు పేర్కొన్నారు. ఈ పర్వదినం మనందరికీ శుభాలు కలిగించాలని, రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు కళకళలాడాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.