ADB: భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటి ZPSS పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు సంజన, శిరీష, శ్రీజ IIITకి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఉద్యోగ బృందం సభ్యులు వారిని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు. జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. ఉద్యోగులు వికేష్ కుమార్, చంద్రకాంత్, సుభాష్, సాయి చరణ్ తదితరులున్నారు.