ప్రకాశం: కొండపి మండలం పెట్లూరులో ఆదివారం తొలి ఏకాదశి పండుగ సందర్భంగా సహజానంద భారతి స్వామి దేవాలయాన్ని కొండేపి ఎమ్మెల్యే, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య సందర్శించారు. మండల నాయకులు, ఆలయ సిబ్బంది వారికి స్వాగతం పలికారు. అనంతరం సహజానంద భారతి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.