కోనసీమ: అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్లో సోమవారం యధావిధిగా PGRS కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా జిల్లా పరిధిలోని మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, నాలుగు మున్సిపల్ కార్యాలయాలు, 22 మండల కేంద్రాల్లో అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.