CTR: ఎస్ఆర్పురం మండలం తయ్యూరు గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సుమన్ తెలిపారు. ఇందులో భాగంగా గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించి 14 మద్యం బాటిళ్లు సీజ్ చేసినట్లు ఆయన వెల్లడించారు. కాగా నిందితుడు చిన్నబ్బపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.