WGL: భద్రకాళి అమ్మవారి శాకాంబరి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయంలో పోలీస్ బందోబస్తు ఏర్పాట్లపై వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాశ్ పరిశీలించారు. ఆలయానికి వచ్చే భక్తులు సజావుగా దర్శనం చేసుకునేందుకు గాను ముందస్తు చర్యలు తీసుకోవాలని మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపికి ఏఎస్పీ పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.