MNCL: 12 గంటల పని విధానాన్ని వాణిజ్య పరిశ్రమల్లో అమలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం బెల్లంపల్లి పట్టణంలో మాట్లాడుతూ.. కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానానికి ఇది పూర్తిగా వ్యతిరేకమైనదని అన్నారు. ఈ కార్యక్రమంలో చాంద్ పాషా, మణిరామ్, రాజన్న పాల్గొన్నారు.