ASR: హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని ఆదివారం సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కే. లోకనాథం ఆరోపించారు. అరకు నియోజకవర్గం అనంతగిరి మండలంలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి పెద్దకోట, జీనబాడు, గుజ్జలి, చిట్టంపాడు ప్రాంతాల్లో 7 వేల ఎకరాలు సేకరించి, నవయుగ కంపెనీకి కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు.