MBNR: బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిద్దామని ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమంలో బాబు జగ్జీవన్ రామ్ ఎంతో చురుగ్గా పాల్గొన్నారు అని గుర్తు చేశారు.