టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సూపర్ సెంచరీతో రెచ్చిపోయాడు. ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో వన్డేలో కేవలం 77 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతడికి ఇది 32వ సెంచరీ. అలాగే, వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో కోహ్లీ(51), సచిన్(49) ఉండగా.. రోహిత్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.