భారత్ షట్లర్ లక్ష్యసేన్ ఇవాళ ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్-2026 టైటిల్ పోరులో లిన్ చున్(కెనడా)తో తలపడనున్నాడు. టోర్నీచరిత్రలో అతనికి ఇది రెండో ఫైనల్ కాగా.. 2022లో రన్నరప్‌గా నిలిచాడు. దీంతో ఈ సారైనా టైటిల్ కొట్టాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నాడు. భారత్ తరఫున చివరిసారిగా పుల్లెల గోపీచంద్ 2001లో ‘ఆల్ ఇంగ్లండ్’ టైటిల్‌ను గెలుచుకున్నాడు.