టీమిండియాతో జరిగిన రెండో టీ20లో దక్షిణాఫ్రికా మహిళా జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 148 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 17.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు లారా వోల్వార్ట్ (54), సునే లూస్ (57) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. భారత బౌలర్లలో శ్రేయాంకా 2 వికెట్లు పడగొట్టింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల T20 సిరీస్లో SA 2-0 ఆధిక్యంలో నిలిచింది.