టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై శుభమన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరితో కలిసి ఆడటంపై మాట్లాడాడు. రోహిత్, కోహ్లీ వంటి ప్లేయర్లను చూస్తూ తాను పెరిగినట్లు తెలిపాడు. ఇప్పుడు వారితో కలిసి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంతో కలిగిన అనుభూతిని మాటల్లో చెప్పలేనని వెల్లడించాడు. ఆ అనుభూతిని వర్ణించడం కష్టమేనని చెప్పుకొచ్చాడు.