SA T20 లీగ్‌లో ఎంఐ కేప్‌టౌన్ విజేతగా నిలిచింది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన ఫైనల్లో 76 పరుగుల తేడాతో విజయం సాధించింది. 181 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్ 18.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఎంఐ తొలిసారి SA20 ఛాంపియన్స్‌గా అవతరించింది. మార్కో జాన్సెన్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.