మెల్బోర్న్ టెస్టులో నిలకడగా రాణిస్తున్న యశస్వి జైస్వాల్ ఔటయ్యాడు. అయితే.. యశస్వి ఔటైన తీరు వివాదాస్పదంగా మారింది. తొలుత ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ఆసీస్ డీఆర్ఎస్ తీసుకుంది. సమీక్షలో థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఈ నిర్ణయంపై యశస్వి అసహనం వ్యక్తం చేశాడు. స్నికో మీటర్లో స్రైక్స్ రాకపోయినా.. బంతి టర్న్ అయిందనే కారణంతో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు.