మెల్బోర్న్ టెస్టులో ట్రావిస్ హెడ్ వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. హెడ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి పంత్ ఔటయ్యాడు. ఈ క్రమంలో హెడ్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. హెడ్‌ను అన్ని ICC నాకౌట్ మ్యాచ్‌ల నుంచి నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. మ్యాచ్‌ను పిల్లలు సైతం చూస్తున్నారని.. హెడ్ అలా వ్యవహరించడం సరికాదని మండిపడుతున్నారు.