WPL-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా మొత్తం ఈ సీజన్ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని RCB యాజమన్యం ప్రకటించింది. దీంతో ఆమె స్థానంలో స్నేహ రాణా జట్టులోకి తీసుకుంది. స్నేహ గత ఏడాది గుజరాత్ జెయింట్స్ తరఫున ఆడింది. అయితే ఈ సారి వేలంలో ఆమెను ఏ జట్టు కొనుగోలు చేయలేదు.