ఐర్లాండ్ మహిళల జట్టుతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు భారీ విజయం సాధించింది. 436 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐర్లాండ్.. 31.4 ఓవర్లలో 131 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో తనూజా 2, దీప్తి 3, సయాలీ 1, సాధు 1, మిన్ను మని 1 వికెట్ తీశారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 435/5 రికార్డు స్కోరు చేసింది. ప్రతికా రావల్(154), స్మృతీ మంధాన(135) శతకాలు చేశారు.