కటక్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోర్ సాధించింది. 49.5 ఓవర్లలో 304 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాటర్లు బెన్ డకెట్(65), జో రూట్(69), బట్లర్ (34), బ్రూక్(31), లివింగ్‌స్టోన్(41) సమిష్టిగా రాణించారు. భారత బౌలర్లలో జడేజా 3 వికెట్లు తీయగా.. షమీ, రాణా, పాండ్యా, చక్రవర్తి తలో వికెట్ తీసుకున్నారు. భారత్ టార్గెట్ 305.