సంజూ శాంసన్ మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. తొలి మ్యాచ్‌లో 6 పరుగులు మాత్రమే చేసిన సంజూ, PBKSతో మ్యాచ్‌లోనూ 7 పరుగులకే పెవిలియన్ చేరాడు. బార్ట్లెట్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ట్రేడింగ్ ద్వారా CSKలోకి వచ్చిన సంజూపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, వరుసగా విఫలమవుతూ అతడు ఆ అంచనాలను అందుకోలేకపోతుండటం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.