హైదరాబాద్ వేదికగా ఇవాళ్టి నుంచి మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ టోర్నీ జరగనుంది. ఇందులో భాగంగా ఇవాళ భారత జట్టు ఉరుగ్వే తలపడనుంది. ఈ ఏడాది ఆగస్ట్ 14-30 తేదీల్లో బెల్జియం-నెదర్లాండ్స్లో జరిగే వరల్డ్ కప్లో మొత్తం 16 జట్లు తలపడనుండగా.. ఇప్పటికే 9 బెర్తులు ఖాయమయ్యాయి. ఈ క్వాలిఫైయర్స్లో తొలి 3 స్థానాల్లో నిలిచిన జట్లు టోర్నీకి అర్హత సాధిస్తాయి.