బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా 184 పరుగుల తేడాతో టీమిండియాపై విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్లో 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆసీస్ బౌలర్ల ధాటికి తలవంచింది. జైస్వాల్(84) ఒంటరి పోరాటం చేశాడు. చివరి ఏడు వికెట్లను భారత్ 35 పరుగుల తేడాతో కోల్పోయింది. కాగా ఈ విజయంతో ఐదు టెస్టుల సిరీస్లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యం సంపాదించింది.