బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచులో బ్యాటర్ కేఎల్ రాహుల్‌ను మరికొంత సమయం ఆడిస్తే బాగుండేదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ‘ఇంకా రోజున్నర సమయం మిగిలింది. అలాంటి సమయంలో 19 బంతుల్లో 22 పరుగులు చేసిన దూకుడు మీదున్న రాహుల్‌ను మరికొద్ది సేపు ఆడించాల్సింది. అతనిని 60-70 పరుగులు చేసేందుకు ఛాన్స్ ఇస్తే బాగుండేది. అదేమీ మొత్తం మ్యాచుపై ప్రభావం చూపదు’ అని అన్నాడు.