AP: కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఫైర్ అయ్యారు. మహిళలపై అఘాయిత్యాలను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు ఎలాంటి రక్షణ లేకుండా పోయిందని.. కూటమి పాలన చీకటి కాలంగా మారిందని ఎద్దేవా చేశారు. ఎన్ని దారుణాలు జరిగిన CM చంద్రబాబుకు ఎలాంటి బాధ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మహిళల రక్షణ కోసం ‘దిశ’ యాప్ తీసుకొచ్చినట్లు ఆమె గుర్తు చేశారు.