TG: కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులతో మాట్లాడానని అన్నారు. ఆ హత్య వెనుక పరోక్షంగా ఎవరైన ఉన్నా వారిని కూడా శిక్షించాలన్నారు. దీనిని రాజకీయం చేయడం బాధాకరం అని పేర్కొన్నారు. జగిత్యాల ప్రజలు కోరుకునేది అభివృద్ధే తప్ప.. హత్యా రాజకీయాలు కాదని వెల్లడించారు.