TG: పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో రూ.49 కోట్లతో అసెంబ్లీని పునర్నిర్మిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నామని, ఒకే దగ్గర ఉంటే టైం సేవ్ అవుతుందన్నారు. విద్యుత్ చార్జీలపై ఈఆర్సీ దగ్గరకు వెళ్లడం పెద్ద జోక్.. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారు అని ప్రశ్నించారు.