»Vitamin B12 Deficiency Eat These Food To Avoid Anemia Healthy Life
Vitamin B12: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తప్పక తినాల్సిందే
విటమిన్లు మన శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనం తీసుకునే ఆహారం(Food)లో ఇవి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. కీళ్ల నొప్పులు కూడా ఎదుర్కొంటారు. ఇలాంటి ఆహారాలు తీసుకోని వారికి రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది.
Vitamin B12: మన శరీరం, గుండె(Heart) ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ బి12(Vitamin B12) ఆధారిత ఆహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు మన శరీరంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనం తీసుకునే ఆహారం(Food)లో ఇవి లోపిస్తే ఎముకలు బలహీనపడతాయి. కీళ్ల నొప్పులు కూడా ఎదుర్కొంటారు. ఇలాంటి ఆహారాలు తీసుకోని వారికి రక్తహీనత వచ్చే ప్రమాదం ఉంది. ప్రసిద్ధ న్యూట్రిషన్ ఇండియా ప్రకారం, విటమిన్ B12 సమృద్ధిగా లభించే 5 ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం.
బ్రోకలీ(Broccoli)
బ్రోకలీ ఆకుపచ్చ కూరగాయలలో చాలా ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది. విటమిన్ B12తో పాటు విటమిన్ B9 అంటే ఫోలేట్ కూడా సమృద్ధిగా లభిస్తుంది. దీన్ని సలాడ్‌గా తింటే చాలా ఆరోగ్యకరం.
గుడ్డు(Egg)
గుడ్లను కచ్చితంగా సూపర్ ఫుడ్స్ అని పిలుస్తారు. అవి సాధారణంగా ప్రోటీన్ భాండాగారంగా చెబుతారు. ఒక వ్యక్తి రోజులో తీసుకునే విటమిన్ B12 అవసరాలలో 46 శాతం కలిగి ఉంటాయి. అందుకే ప్రతి రోజూ రెండు గుడ్లు తినాలి.
సోయాబీన్స్(soybeans)
సోయాబీన్స్ శాకాహారులకు ప్రోటీన్-రిచ్ ఫుడ్‌గా పరిగణించబడుతుంది. అయితే అవి శరీరానికి విటమిన్ బి-12ను పుష్కలంగా అందిస్తాయి. సోయా పాలు, టోఫు లేదా సోయా భాగాలను తినవచ్చు.
పుట్టగొడుగు(mushroom)
విటమిన్ B-12కు ప్రధాన కేంద్రం. విటమిన్ B-12 కాకుండా.. పుట్టగొడుగులలో కాల్షియం(calcium), ఐరన్(iron), ప్రోటీన్లు(protein)కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది కొంచెం ఖరీదైన ఆహారం అయినప్పటికీ, ఇది ఆరోగ్య పరంగా చాలా ప్రయోజనకారి.