• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

తాగు నీటి కష్టాలకు ‘చెక్’

KNR: వేసవి ముంచుకొస్తున్న నేపథ్యంలో చిగురుమామిడి మండలం సుందరగిరిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా సర్పంచ్ జంగా శిరీష ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. గ్రామంలోని హైస్కూల్ వద్ద ఏళ్ల తరబడి నిరుపయోగంగా ఉన్న బావిని పునరుద్ధరించే పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టారు. క్షేత్రస్థాయిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేయిస్తున్నారు.

February 27, 2026 / 06:03 PM IST

పాఠశాలను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

JGL: అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) బీ. రాజ గౌడ్ శుక్రవారం కోరుట్లలోని కస్తూర్భ గాంధీ బాలికల విద్యాలయం(KGBV) పాఠశాలను ఆకస్మికంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు రిజిస్టర్, విద్యా ప్రగతి, బోధన విధానాలపై సమీక్ష నిర్వహించారు. హాస్టల్ సదుపాయాలు, తాగునీటి వసతులు పరిశీలించి వంటగదిని సందర్శించారు. మధ్యాహ్న భోజనం నాణ్యత, నిల్వ విధానాలపై ఆరా తీశారు.

February 27, 2026 / 06:02 PM IST

రేపు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

PPM: పార్వతీపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రేపు మండల సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో కొండపల్లి సత్యం శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. అయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొనాలని కోరారు . మండలానికి సంబంధించి అధికారులందరూ ప్రగతి నివేదికతో కార్యక్రమంలో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు.

February 27, 2026 / 06:00 PM IST

‘కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలి’

VZM: కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని ఏపీ మార్క్ ఫెడ్ ఛైర్మన్ కర్రోతు బంగారు రాజు కోరారు. జామి మండలం విజినగిరిలో శుక్రవారం అపరాలు కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. కొనుగోలు కేంద్రాల ద్వారా మినుములు క్వింటాకు రూ.7,800, పెసలు 8,768 చెల్లించడం జరుగుతుందన్నారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

February 27, 2026 / 06:00 PM IST

ప్రభుత్వ రంగ సంస్థల పనితీరు PUC ఛైర్మన్‌పై ఆరా

SKLM: ఆమదాలవలస ఎమ్మెల్యే PUC ఛైర్మన్ రవికుమార్ అధ్యక్షతన అమరావతిలో శుక్రవారం ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై అధికారులతో సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం లోని డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ పనితీరుపై సమీక్షించారు. విద్యా అభివృద్ధి, గిరిజన సంక్షేమ పథకాలు, నిధుల వినియోగం వంటి అంశాలపై అధికారులకు వివరాల అడిగి తెలుసుకున్నారు.

February 27, 2026 / 06:00 PM IST

బైక్ రైడర్స్‌కు ఫైన్ విధించిన సీఐ

AKP: ఎలమంచిలి ఇంటర్ పరీక్ష కేంద్రం వద్ద ఓవర్ స్పీడ్‌తో హల్చల్ చేస్తున్న ఇద్దరు బైక్ రైడర్స్‌ను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. వారిని సీఐ ధనుంజయ నాయుడు వద్దకు తీసుకురాగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే ఒక్కొక్కరికి రూ.5,035 చొప్పున ఫైన్ విధించారు. రోడ్ భద్రత నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.

February 27, 2026 / 06:00 PM IST

రేపు అరకు 6 మండలాల వైఎస్ఆర్‌సీపీ నేతల భేటీ

ASR: అరకు నియోజకవర్గానికి చెందిన ఆరు మండలాల నాయకులతో అత్యవసర సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం తెలిపారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర రీజినల్ కో-ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అరకు పార్లమెంట్ పరిశీలకులు బొడ్డేడ ప్రసాద్, అరకు–పాడేరు నియోజకవర్గాల పార్టీ పరిశీలకులు ఏరువాక సత్యరావు హాజరవుతారన్నారు.

February 27, 2026 / 06:00 PM IST

‘విలువలతో భవిష్యత్ అందించటమే జనసేన లక్ష్యం’

కృష్ణా: రేపటి తరానికి విలువలతో భవిష్యత్ అందించటమే జనసేన పార్టీ లక్ష్యమని నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ అన్నారు. శుక్రవారం నాగాయలంకలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాన్ని వెంకట్రామ్ సందర్శించి, సాధకులను అభినందించారు. సమాజం బాగుపడాలని కోరుకునే యువత ప్రతి ఒక్కరు జనసేన ఉద్యమి సభ్యత్వం తీసుకోవాలని కోరారు. ఇందులో జనసేన నాయకులు పాల్గొన్నారు.

February 27, 2026 / 05:59 PM IST

రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి

GNTR: తెనాలి నియోజకవర్గంలో కీలకమైన నందివెలుగు – ఆటో నగర్ (తెనాలి–మంగళగిరి) రహదారి అభివృద్ధి పనులకు రూ. 2.00 కోట్ల వ్యయంతో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

February 27, 2026 / 05:59 PM IST

కవితకు క్లీన్ చిట్.. స్పందించిన అర్వింద్

TG: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడంపై BJP ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పందించారు. ఈ కేసులో కేవలం సాక్ష్యాలు లేవని మాత్రమే కోర్టు చెప్పింది తప్ప.. కవిత నిర్దోషని క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. BJP, BRS ఒకటి కాదని స్పష్టం చేశారు. రాజకీయాల్లో చాలా మంది రక రకాలుగా మాట్లాడుతుంటారని, వాటన్నింటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.

February 27, 2026 / 05:59 PM IST

పేదల సొంతింటి కలకు ప్రభుత్వం మద్దతు: ప్రత్తిపాటి

PLD: గృహ నిర్మాణ రంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.6,357 కోట్లు కేటాయించడం శుభపరిణామమని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల స్థలం ఇస్తామన్న సీఎం నిర్ణయం చరిత్రాత్మకమన్నారు. గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల పేరుతో జరిగిన అవినీతిపై ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

February 27, 2026 / 05:58 PM IST

వేములపాడులో వాహన తనిఖీలు చేపట్టిన ఎస్సై

ప్రకాశం: హనుమంతునిపాడు మండలం వేములపాడు రహదారిపై ఎస్సై మాధవరావు శుక్రవారం విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమంలో భాగంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక సీటులో కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 27, 2026 / 05:58 PM IST

శ్రీకాళహస్తిలో శ్రీనివాస్ రెడ్డికి సన్మానం

TPT: వైసీపీ రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం జాయింట్ సెక్రటరీగా నియమితులైన కొత్తపాటి శ్రీనివాస్ రెడ్డిను శ్రీకాళహస్తిలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

February 27, 2026 / 05:58 PM IST

బాధ్యతలు చేపట్టిన నూతన కలెక్టర్

GDWL: ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడటమే నా ప్రథమ ప్రాధాన్యత అని నూతన కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన అధికారులతో సమావేశమయ్యారు. విధి నిర్వహణలో పారదర్శకత ఉండాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 27, 2026 / 05:57 PM IST

‘విద్యార్థులు ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలి’

ప్రకాశం: పదవ తరగతి విద్యార్థులు రానున్న పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించాలని ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్ శ్యామల కాశిరెడ్డి అన్నారు. శుక్రవారం వెలిగండ్ల జిల్లా పరిషత్ పాఠశాలలో ఫేర్వెల్ పార్టీ జరిగింది. ఈ కార్యక్రమంలో కాశిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.

February 27, 2026 / 05:55 PM IST