AKP: ఎలమంచిలి ఇంటర్ పరీక్ష కేంద్రం వద్ద ఓవర్ స్పీడ్‌తో హల్చల్ చేస్తున్న ఇద్దరు బైక్ రైడర్స్‌ను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. వారిని సీఐ ధనుంజయ నాయుడు వద్దకు తీసుకురాగా వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అలాగే ఒక్కొక్కరికి రూ.5,035 చొప్పున ఫైన్ విధించారు. రోడ్ భద్రత నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.