మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని నస్పూర్‌కు చెందిన నిరుపేద యువతి గంధం సరస్వతికి B.ED చదువు కొరకు హరికృష్ణ చారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల స్టేషనరీని గురువారం ఆమెకు అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ కంబాల నర్సయ్య మాట్లాడుతూ.. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని ఉద్దేశంతో అన్ని ట్రస్ట్ తరుపున అందజేసినట్లు ఆయన తెలిపారు.
మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్)గా ఫైజాన్ అహ్మద్, ఐఏఎస్ నియమితులయ్యారు. నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వం ఇక్కడికి బదిలీ చేసింది. ఈ మేరకు ప్రస్తుతం ఆ పదవిని ఫుల్ అడిషనల్ చార్జ్ (FAC)గా నిర్వహిస్తున్న రాధిక గుప్తా, ఐఏఎస్‌ను బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు.
NLR: తెలుగుదేశం పార్టీ నెల్లూరు మేయర్ అభ్యర్థిగా 53వ డివిజన్ కార్పొరేటర్ దేవరకొండ సుజాత ఖరారు అయ్యారు. మంత్రి నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కలిసి ఆమె పేరును అధికారికంగా గురువారం ప్రకటించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో సుజాతను పరిచయం చేశారు.
KMR: మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి ఎట్టకేలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గురువారం గ్రామానికి చేరుకున్న బస్సుకు గ్రామస్థుల ఘనంగా స్వాగతం పలికారు. ఆర్టీసీ డ్రైవర్లను శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న రవాణా కష్టాలు తీరడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
SRPT : గరిడేపల్లి మండలంలోని రాయినిగూడెం గ్రామం వద్ద ఇవ్వాళ ద్విచక్రవాహనం, సైకిల్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రంగాపురం గ్రామానికి చెందిన బైక్ చోదకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో, స్థానికులు 108 వాహనంలో హుజూర్‌నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
NLG: కేతేపల్లి మండలం బండపాలెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దూదిపాల రాంరెడ్డి, మారం మీనారెడ్డి, దూదిపాల సాగర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ కాంగ్రెస్‌లో చేరారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ లోని తన నివాసంలో వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అభివృద్ధి, సంక్షేమం దిశగా పనిచేయాలని వారికి సూచించారు.
BHNG: ఆలేరు పురపాలక సంఘం నూతన పాలకవర్గం గురువారం కొలువుదీరింది. నూతన ఛైర్‌పర్సన్‌గా ఎన్నికై బాధ్యతలు స్వీకరించిన బీజన బాలమణి భాస్కర్‌ను కౌన్సిలర్ల్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకువచ్చిన పట్టణ ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
ADB: ఉట్నూర్ ఐటిడిఏ పీవోగా విధులు నిర్వహిస్తున్న 2019 IAS బ్యాచ్ ఖుష్బూ గుప్తా బదీలయ్యారు. మహబూబ్నగర్ జిల్లా పాలనాధికారి & మెజిస్ట్రేట్‌గా బదీలయ్యారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె గిరిజన అభివృద్ధి కోసం ఉట్నూరుకు వచ్చి POగా సేవలందించారు. దీంతో ప్రజలు ఖుష్బూ గుప్తాకు కృతజ్ఞతలు తెలియజేశారు.
SKLM: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌ను మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, తదితరులు బుధవారం రాత్రి కలెక్టర్ కార్యాలయంలో కలుసుకున్నారు. ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. డయేరియాతో చనిపోయిన వారి సంఖ్య ఎందుకు దాస్తున్నారని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
KDP: బ్రహ్మంగారిమఠం మఠాధిపతి వెంకటాద్రి స్వాముల వారి పట్టాభిషేకం మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను గురువారం సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో ఎస్సై శివప్రసాద్ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై వివరించారు. ప్రత్యేక దర్శన క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
SS:పెద్దవడుగూరు మండలంలోని పలు గ్రామాల్లో జింకల బెడద అధికమవుతోంది. మందగా వచ్చి పంటలను నాశనం చేస్తున్నాయి. పెద్దవడుగూరు, చిన్నవడుగూరు, దిమ్మగుడి, నాగలాపురం, గుత్తిఅనంతపురం, విరుపాపురం, ఆవులాంపల్లి, మల్లేనిపల్లి, బందార్లపల్లి, తదితర గ్రామాల సమీపంలో రైతులకు చుక్కలు చూపెడుతున్నాయి. పంట పెట్టుబడి కూడా చేతికి అందని పరిస్థితి దాపురించిందన్నారు.
నంద్యాల పట్టణంలోని జిల్లా వైసీపీ కార్యాలయంలో ఇవాళ వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సాధనకై ప్రతి ఒక్కరూ మార్చి 1న చలో కడప కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు.
VZM: కొత్తవలస మండల తహసీల్దార్‌గా ఎస్. రమాలక్ష్మీ గురువారం ఇన్‌ఛార్జ్ తహసిల్దార్ పీ.సునీత నుంచి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడికి రాకముందు రాష్ట్ర ప్రధాన భూపరిపాలన విభాగంలో పనిచేస్తూ కొత్తవలసకు బదిలీపై వచ్చారు. ఇప్పటి వరకు మండల తహసీల్దార్ గా విధులు నిర్వహించిన అప్పలరాజు కలెక్టర్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. భూసమస్యలపై దృష్టి సారిస్తానని రమాలక్ష్మీ చెప్పారు.
MHBD: రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఆధ్వైత్ కుమార్ సింగ్ బదిలీ అయ్యారు. హన్మకొండ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న స్నేహ శబరీష్ నూతన కలెక్టర్‌గా నియమితులయ్యారు. అయితే, ఆమె భర్త డా. శబరీష్ ఇదే జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వర్తించడం విశేషం.
W.G: ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు (RRR) బ్యాంకులను మోసం చేసి కోట్లాది రూపాయల రుణాలు ఎగ్గొట్టారని ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ ఆరోపించారు. ఈ కుంభకోణాలపై ఇప్పటికే సీబీఐ కేసులు ఉన్నాయని, ఆయన బయట ఉంటే సాక్షులను భయపెట్టి కేసులను పక్కదారి పట్టించే అవకాశం ఉందని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని సునీల్ కుమార్ తెలిపారు.