గార్లదిన్నె మండలం కృష్ణాపురంలో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి అంగన్‌వాడీ కేంద్రానికి సరఫరా అవుతున్న కోడిగుడ్లను పరిశీలించారు. చిన్న పరిమాణంలో ఉన్న గుడ్లను గమనించి, నాణ్యమైనవి పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతపై విద్యార్థులతో మాట్లాడారు.
SKLM: పట్టణంలో హెల్మెట్ ధరించడంపై ట్రాఫిక్ పోలీసుల సిఐ రామారావు ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, చిన్న దూరం ప్రయాణమైనా హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ వినియోగించాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు చాక్లెట్లు పంపిణీ చేశారు.
ASF: తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గోలేటికి చెందిన భోగే ఉపేందర్ ఎన్నికయ్యారు. వరంగల్‌లో జరిగిన రాష్ట్ర 4వ మహాసభలో ఈ ఎన్నిక జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం. నరసింహ ప్రకటనలో తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
KNR: స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలో సర్టిఫికేట్ కోర్సు ఇన్ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ కోర్సు 27వ బ్యాచ్ 6 నెలలపాటు జరిగింది. ఇందులో భాగంగా రెండు రోజులపాటు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. శనివారం జర్నలిజం పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని కోర్సు కో ఆర్డినేటర్, తెలుగు విభాగం అధ్యక్షులు, అసోసియేట్ ప్రొఫెసర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.
MNCL: కార్పొరేషన్ అభివృద్ధిలో కార్పొరేటర్లు, అధికారులు రాజీ పడవద్దని MLA ప్రేమ్ సాగర్ రావు సూచించారు. మంచిర్యాల మున్సిపల్ కార్యాలయం ఆవరణలో డివిజన్ల ఆఫీసర్లతో సమావేశం జరిగింది. ప్రతి ఇంటిని తమ ఇంటిగా భావించి సమస్యల పరిష్కారానికి ఆయా డివిజన్ల అధికారులు బాధ్యత వహించాలని అన్నారు. మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేశ్, అధికారులు పాల్గొన్నారు.
అనకాపల్లి: జిల్లాలో 91.37 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి చేసినట్లు డీఆర్డీఏ పీడీ శచీదేవి తెలిపారు. మొత్తం 2,53,987 మందికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా 2,32,077 మందికి పంపిణీ చేశామన్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారికి పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఈనెల 2వ తేదీన వారికి పింఛన్లను పంపిణీ చేస్తామన్నారు.
ఖమేనీ చనిపోయారు: ట్రంప్ఇరాన్ సుప్రీంలీడర్ అలీ ఖమేనీ చనిపోయారని అమెరికార ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించారు. దీంతో ఇరాన్ పౌరులతో పాటు, అమెరికన్లు, బాధిత దేశాలకు న్యాయం జరిగిందని తన ట్రూత్ సోషల్‌లో రాసుకొచ్చారు. దాడులు మరో వారం కొనసాగుతాయని తెలిపారు. అటు ఇప్పటివరకు అందిన సూచనల ప్రకారం ఆ నిరంకుశుడు(ఖమేనీ) జీవించి ఉండకపోవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు.
GDWL: విద్యార్థులు సైన్స్‌లో నూతన ఒరవడి సృష్టించాలని అయిజ ఎంఈవో రాములు దయాల్ పేర్కొన్నారు. నేషనల్ సైన్స్ డే ను పురస్కరించుకొని శనివారం పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు తయారుచేసిన ఆవిష్కరణలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు.
KRNL: నగరపాలక సంస్థలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని సమావేశ భవనంలో నిర్వహించనున్నట్లు ఆదివారం కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. మౌలిక వసతులు, రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, పరిశుభ్రత సమస్యలపై ప్రజలు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు ఇవ్వవచ్చని, వాటిని సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరిస్తామని ఆయన పేర్కొన్నారు.
SRCL: వీర్నపల్లి మండలం గర్జనపల్లిలో ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. పొలంలో పెట్టిన నాటు బాంబు పేలడంతో మేతకు వెళ్లిన పాడి గేదె తీవ్రంగా గాయపడింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గాయపడిన గేదెకు పశువైద్యులు చికిత్స అందిస్తున్నారు. అడవి జంతువుల కోసం ఏర్పాటు చేసిన నాటు బాంబు కావచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ADB: ప్రభుత్వ సర్వీసులో సుదీర్ఘ కాలం పాటు నిబద్ధతతో పనిచేసి, ప్రజలకు సేవలందించడం అభినందనీయమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పదవీ విరమణ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పదవీ విరమణ అనేది కేవలం విధులకు మాత్రమేనని, సమాజ సేవలో ఆమె అనుభవం ఎంతో అవసరమని పేర్కొన్నారు.
NRML: చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ తెలిపారు. ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఉప ఆలయాలను కూడా మూసివేస్తామన్నారు. మంగళవారం తెల్లవారుజామునే అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు, నివేదనలు పూర్తి చేసి, ఉదయం 7 గంటలకు ఆలయ ద్వారాలను మూసివేస్తామని వివరించారు.
SRCL: వేములవాడ నియోజకవర్గ పరిధిలోని వరద కాల్వకు అధికారులు రాంపూర్ పంపు హౌస్ నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా రెండవ, మూడవ మోటార్లు ఆన్ చేసి వరద కాల్వకు నీటిని విడుదల చేశారు. కాగా నిన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వేములవాడ నియోజకవర్గనికి నీటిని విడుదల చేయాలని కోరారు. వెంటనే మంత్రి నీటిని విడుదల చేయవలసిందిగా ఆదేశించారు.
JGL: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వాతావరణం నెలకొంది. 36 ఏళ్లపాటు పోలీస్ శాఖలో నిబద్ధతతో సేవలందించిన ఏఎస్ఐ బిక్షపతి ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ పూలమాల వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆయన సేవలను కొనియాడుతూ.. శాఖకు చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలన్నారు.
JGL: జిల్లా వసతి గృహ సంక్షేమ అధికారుల సంఘం డైరీని జగిత్యాల జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సునీతతో కలిసి శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎన్టీవోస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి, ట్రెజరర్ ఎండీ సాజిద్ బాబా, సంక్షేమ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్,సెక్రటరీ ఉన్నారు.