• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోండి: ఏపీవో

AKP: దేవరాపల్లి మండలంలో ఉపాధి హామీ పనుల అమలును అధికారులు బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వలసలు పెరుగుతున్న నేపథ్యంలో రైవాడ, గరిసింగి, దేవరాపల్లి పంచాయతీల్లో జరుగుతున్న పనులను ఏపీఓ రుక్మిణీదేవి, టెక్నికల్ అసిస్టెంట్ లక్ష్మణరావు పరిశీలించారు. స్థానికంగా ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని వలసలు తగ్గించుకోవాలని కూలీలకు సూచించారు.

March 5, 2026 / 06:29 AM IST

కూతురిని మోసం చేసిన కేసులో తల్లి అరెస్ట్

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి నర్సింగ్ కాలేజీ హెడ్ కుక్ డి.రమణమ్మను చెక్ బౌన్స్, చీటింగ్ కేసులో బుధవారం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన సొంత కూతురు ప్రదీపకు రూ.8 లక్షలు ఇవ్వాల్సి ఉండగా రమణమ్మ చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేసింది. దీనిపై బాధితురాలు కోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తి అనూష నిందితురాలికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు.

March 5, 2026 / 06:27 AM IST

‘ప్రభుత్వ ఓఆర్ఎస్ ప్యాకెట్లనే వాడండి’

SKLM: జిల్లాలో ప్రభుత్వం సరఫరా చేసే ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు మాత్రమే వినియోగించాలని అసిస్టెంట్ కలెక్టర్ పృథ్విరాజ్ కుమార్ అన్నారు. బుధవారం ఆయన స్థానిక రిమ్స్‌లో సమావేశం నిర్వహించారు. ఆయన మట్లాడుతూ.. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ, ప్రభుత్వ వైద్య సిబ్బంది సరఫరా చేసిన ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు మాత్రమే వాడుట ఆరోగ్యానికి మంచిదని సూచించారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు.

March 5, 2026 / 06:27 AM IST

రోజులో కేవలం 12గంటల్లోపే సరఫరా

BHNG: జిల్లాలో సుమారు 4లక్షల విద్యుత్‌ కనెక్షన్లు ఉండగా, ఇందులో 1.20 లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అయితే వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్నామని కాంగ్రెస్‌ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కనీసం 12గంటల నుంచి 14 గంటలు కూడా సరఫరా చేయడం లేదు అని రైతులు ఆవేదన చెందుతున్నారు.

March 5, 2026 / 06:27 AM IST

పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్

KDP: కొండాపురం మండలం డొంకపల్లి గ్రామంలోని ఆశ్రమం గుడి వెనుక పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు బుధవారం దాడి చేశారు. ఎస్సై జయరాములు తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ సోదాల్లో ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.13,040 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.

March 5, 2026 / 06:26 AM IST

ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికపై కలెక్టర్ సమీక్ష

JGL: మార్చి 6 నుంచి జూన్ 12 వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో వివిధ శాఖల పనుల లక్ష్యాలు, కార్యాచరణ ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్, కార్యాలయాల పరిశుభ్రత తదితర విషయలపై సమీక్షించారు.

March 5, 2026 / 06:26 AM IST

నేడు నారా లోకేష్ విశాఖ రాక

VSP: రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్ ఇవాళ సాయంత్రం 4.45 గంటలకు వాయుమార్గం ద్వారా విశాఖపట్నం చేరుకోనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు వాల్తేర్ క్లబ్‌లో జరిగే రమణబాబు కుమారుని వివాహ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం విశాఖపట్నం నుంచి విజయవాడకు బయలుదేరనున్నారు.

March 5, 2026 / 06:24 AM IST

ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి

CTR: ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పెనుమూరు మండలంలో జరిగింది. మండలంలోని స్వామి రెడ్డి పల్లికి చెందిన గోవిందు బైక్‌‌పై వస్తుండగా.. పాకాల మండలానికి చెందిన బాబు, రెడ్డప్ప ఆచారి మరొక బైక్‌లో వస్తూ చార్వగాని పల్లె సమీపంలో ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో గోవిందు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేపట్టారు.

March 5, 2026 / 06:24 AM IST

ఐదుగురు సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు

అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని ఐదుగురు సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం కమిషనర్ నిర్వహించిన అధికారిక టెలీ కాన్ఫరెన్స్‌కు గైర్హాజరైనందుకు జ్యోత్స్న, హరికిషోర్, లోకేష్ నాయక్, రేష్మా, మంజునాథ్‌లపై ఈ చర్యలు తీసుకున్నారు. 24 గంటల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు.

March 5, 2026 / 06:20 AM IST

‘చిన్నబాబు కుటుంబానికి అండగా ఉంటాం’

E.G: గోపాలపురం మండలం వాదాలకుంట గ్రామానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకుడు ములపర్తి చిన్నబాబు ఇటీవల మరణించారు. ఈ నేపథ్యంలో మండల అధ్యక్షుడు వెలగా శ్రీరామ్ మూర్తి ఆధ్వర్యంలో నాయకులు చిన్నబాబు కుటుంబ సభ్యులకు కొంతమేర ఆర్థిక సహాయం చేసి పార్టీ అండగా ఉంటుందని ధైర్యం తెలిపారు. కార్యకర్తలకు పార్టీ బాసటగా నిలుస్తుందని శ్రీరామ్ మూర్తి తెలిపారు.

March 5, 2026 / 06:20 AM IST

గిరిజన గురుకుల పాఠశాలలో అధికారి తనిఖీలు

NLR: రాపూరు గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఐటీడీఏ అధికారిణి కె. సుజాత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం, హాస్టల్ గదులు, రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్ర మిషన్ కింద మరుగుదొడ్ల పనులను పర్యవేక్షించి అవసరమైన వసతులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

March 5, 2026 / 06:20 AM IST

HYDలో కిషన్ రెడ్డి పర్యటన

TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇవాళ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన బన్సీలాల్ పేట డివిజన్‌లో పర్యటించి స్థానిక అంశాలపై సమీక్షించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి రైల్వే స్టేషన్‌కు చేరుకుని, అక్కడ జరుగుతున్న ఆధునీకరణ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. పనుల పురోగతిపై రైల్వే అధికారులతో చర్చించి తగు సూచనలు చేయనున్నారు.

March 5, 2026 / 06:20 AM IST

నిత్యవసరాల ధరలు అదుపులో ఉండాలి: జేసీ

W.G: జిల్లాలో నిత్యవసర వస్తువుల ధరల పెరుగుదలపై జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి బుధవారం కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. పౌర సరఫరాలు, ప్రణాళిక, మార్కెటింగ్ శాఖల అధికారులతో కలిసి వివిధ మండలాల్లో వంటనూనెలు, కందిపప్పు, ఎండుమిర్చి హోల్సేల్, రిటైల్ ధరల వ్యత్యాసాన్ని వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు.

March 5, 2026 / 06:17 AM IST

శ్రీశైలంలో నిత్యాన్నదాన పథకానికి విరాళం

NDL: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్న ప్రసాద వితరణ పథకానికి HYDకు చెందిన రవి రూ.1,00,100 విరాళాన్ని అందించారు. ఈ మేరకు దాత కుటుంబసభ్యులతో కలిసి బుధవారం శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం విరాళాల కేంద్రంలో పర్యవేక్షకులు అయ్యన్నకు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దాతను విరాళానికి సంబంధించిన బాండ్, లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.

March 5, 2026 / 06:16 AM IST

AU రేపటి నుంచి ఎల్.ఎల్.బి పరీక్షలు

 ప్రకాశం: ఒంగోలులోని ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం అనుబంధ న్యాయ కళాశాలలో ఎల్. ఎల్. బి మొదటి సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. రేపటి నుంచి ఈనెల 10 వ తేదీ వరకు జరుగుతాయని యూనివర్సిటీ పరీక్షల విభాగం కంట్రోలర్ ప్రొఫెసర్ సోమశేఖర్ తెలిపారు. కాన్స్టిట్యూషన్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా, కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లా కోర్సుల విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయన్నారు.

March 5, 2026 / 06:16 AM IST