అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని ఐదుగురు సచివాలయ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం కమిషనర్ నిర్వహించిన అధికారిక టెలీ కాన్ఫరెన్స్‌కు గైర్హాజరైనందుకు జ్యోత్స్న, హరికిషోర్, లోకేష్ నాయక్, రేష్మా, మంజునాథ్‌లపై ఈ చర్యలు తీసుకున్నారు. 24 గంటల్లోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కమిషనర్ ఆదేశించారు.