KMR: ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి గ్రామంలో లావణ్య (25) అనే వివాహిత శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేష్ తెలిపారు. తన కుమార్తె మృతిపై అనుమానం ఉందని తల్లి నరసవ్వ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం బాలాలయంలో స్వామివారి టేకు విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమం ఆలయ ఈవో విజయరాజు ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హాజరయ్యారు. ముందుగా ఆలయ అర్చకులు వారిని స్వాగతం పలికారు. అనంతరం విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
VZM: చీపురుపల్లి MLA కిమిడి కళా వెంకటరావును శుక్రవారం గరివిడి వెటర్నరి కాలేజీ విద్యార్థులు కలిసారు. రాష్ట్ర వ్యాప్తంగా 2000 మందికి పైగా వెటర్నరీ గ్రాడ్యుయేట్లు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాల కోసం ఎదురుచూస్తున్నారని ఈ పోస్ట్ గ్రామీణ పశుసంవర్థక వ్యవస్థలో అత్యంత కీలకమన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసువెళ్లాలని ఆయనకు వినతిపత్రం అందించారు.
PPM: కొమరాడ గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయాన్నే ప్రారంభమైంది. ఇందులో భాగంగా సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి సొమ్మును అందించారు. కొమరాడ మండల రైతు అధ్యక్షుడు బత్తిలి శ్రీను ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుంచే పంపిణీ చేసినట్లు సచివాలయ సిబ్బంది తెలిపారు.
SKLM: నగరంలో సేకరించిన తాగునీటి నమూనాల్లో ప్రమాదకరమైన ‘ఈ-కోలి’ బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఇదే డయేరియా వ్యాప్తికి ప్రధాన కారణమని ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. శుక్రవారం ఆయన నగరంలోని డయేరియా ప్రాంతాల్లో పర్యటించారు. ఇప్పటివరకు 158 డయేరియా కేసులు నమోదు కాగా, 47 మంది డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు.
T20 WC-2026లో భాగంగా పాకిస్తాన్ సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే శ్రీలంకను ఓడించాలి. రన్ రేట్ పరంగా కూడా న్యూజిలాండ్‌ను అధిగమించాలి. పాక్ ముందుగా బ్యాటింగ్ చేస్తే శ్రీలంకను 64 పరుగుల తేడాతో ఓడించాలి. లక్ష్యాన్ని ఛేదించాలంటే, 13.1 ఓవర్లలో మ్యాచ్‌ను ముగించాలి. విఫలమైతే న్యూజిలాండ్ నేరుగా సెమీఫైనల్‌కు వెళ్తుంది. అంటే నెట్ రన్ రేట్ ఈ మ్యాచ్‌కు కీలకం కానుంది.
TG: యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదకొండో రోజైన ఇవాళ ఉదయం స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోల్సోత్సవం నిర్వహించనున్నారు. దీంతో 11 రోజులుగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి కానున్నాయి. నిన్న ఉదయం మహాపూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం స్వామివారికి చక్రతీర్థం ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు.
WGL: 20వ డివిజన్ కాశీబుగ్గలో అధిక వడ్డీ ఇస్తానని ప్రజలను మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక కిరాణా వ్యాపారి వీరశెట్టి సురేశ్ స్థానికులను నమ్మించి దాదాపు ఒక కోటి రూపాయల వరకు వసూలు చేసి పరారయ్యాడు. 15 రోజుల క్రితం తన షాపుకు తాళం వేసి అప్పటి నుంచి కనిపించకపోవడంతో బాధితులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
CTR: నిండ్ర మండలం కైపాకం నందు నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం స్థానిక కూటమి నాయకులతో కలిసి పింఛన్‌లు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నందు మాత్రమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం వృద్దులు, వితంతువులకు ప్రతి నెల అందిస్తున్నామని తెలిపారు.
తిరుపతి రుయా ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. రెండు మెషీన్లు ఏర్పాటు చేయగా వీటిని శుక్రవారం ప్రారంభించారు. గతంలోనే నెఫ్రోప్లస్ ఆధ్వర్యంలో పేదలకు డయాలసిస్ చేస్తున్నారు. అత్యవసర సమయాల్లో, తీవ్రమైన కిడ్నీ సమస్య ఉన్నవారికి ఈ కొత్త సెంటర్లో ఉచితంగా డయాలసిస్ చేస్తారు. నేటి నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 24 గంటలు ఇది తెరిచే ఉంటుంది.
GDWL: జిల్లాలో సీడ్ పత్తి రైతులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, NHPS జిల్లా చైర్మన్ రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిని కలిగి వినతిపత్రం అందజేశారు. హామీ ఇచ్చిన 80% పేమెంట్లు ఇంకా పూర్తవలేదని, తక్షణమే చర్య తీసుకోవాలని కోరారు.
MNCL: లక్షెట్టిపేట మండలంలోని వివిధ గ్రామాలలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు వివిధ చట్టాలపై అవగాహన పెంచుకున్నారని స్థానిక ఎంపీడీవో సరోజ తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. నూతన వార్డు సభ్యులకు ఐదు రోజులపాటు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా వారికి పంచాయతీరాజ్ చట్టం, గ్రామపంచాయతీ విధులు, నిధులు, బాధ్యతల గురించి వివరించామన్నారు.
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ప్రత్యేక సమావేశం జరగనుంది. మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం, మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వైస్ ఛైర్మన్లు, పాలక సభ్యులు అధికారులు పాల్గొంటారని అన్నారు.
ELR: పెదవేగి అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి, ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశాలకు మార్చి 1న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ రమేష్ బాబు తెలిపారు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
TG: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన భూభారతి స్కాం యాదాద్రి భువనగిరి జిల్లాలో సైతం పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టించింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ ఫీజులో మోసం చేశారని పలువురిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే రిజిస్ట్రేషన్ చేసే ముందు క్షుణ్ణంగా చెక్ చేయాల్సిన తహసీల్దార్లు ఎందుకు చేయలేదనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకటం లేదు.