• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉప సర్పంచ్ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడిగా శంకర్

BHPL: ఉప్పసర్పంచుల ఫోరం భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షుడిగా గణపురం మండలం లక్ష్మీరెడ్డిపల్లి గ్రామ ఉపసర్పంచ్ మొగిలి శంకర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన ఉపాధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ.. సంఘం సమస్యల కోసం ఎల్లవేళల కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

March 6, 2026 / 04:30 PM IST

పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

సత్యసాయి: పుట్టపర్తి మండలం వెంగళమ్మ చెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఖిద్మత్ ఎ ఖల్క్ చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. ట్రస్ట్ నిర్వాహకులు షామీర్ ఆధ్వర్యంలో 70 మంది పదో తరగతి విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్లు, పెన్నులు, స్కేళ్లను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయుడు జాకబ్, ఇన్‌ఛార్జ్ ఉపాధ్యాయుడు రమణ చేతుల మీదుగా ఈ సామాగ్రిని అందజేశారు.

March 6, 2026 / 04:30 PM IST

ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం

MHBD: డోర్నకల్ మండలంలోని అమ్మపాలెం రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయంపై నేడు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యవసాయ అధికారిని సరిత, ఆత్మ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. రైతులు ప్రకృతి వ్యవసాయం పట్ల దృష్టి సారించాలని, పంటల సాగులో మెలకువలను పాటించి అధిక దిగుబడిలను పొందాలని అన్నారు.

March 6, 2026 / 04:30 PM IST

బండ్లగూడలో రైల్వే సర్వే.. ఇళ్లపై ఆందోళన

SRD: పటాన్ చెరు డివిజన్ బండ్లగూడలో సౌత్ సెంట్రల్ రైల్వే ట్రాక్ పునరుద్ధరణలో భాగంగా ట్రాక్‌కు ఇరువైపుల 50 మీటర్లలోని కట్టడాలపై సర్వే జరిగింది. ఇళ్లను తొలగిస్తారేమోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలకు అన్యాయం జరగకుండా ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో మాట్లాడతామని మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు.

March 6, 2026 / 04:30 PM IST

రోడ్డు ప్రమాదం.. విద్యార్థికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: తిరుపతి నుంచి మదనపల్లెలో బంధువుల పెళ్లికి వస్తున్న బీటెక్ విద్యార్థి ధనుష్(22) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం ఉదయం స్నేహితుడి బైక్‌పై బెంగళూరు రోడ్డులోని మడికాయల శివాలయం వద్దకు వెళ్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. గాయపడిన ధనుష్‌ను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 6, 2026 / 04:29 PM IST

ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని వినతి

SRCL: జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మ్యాకల పర్శరాములు డిమాండ్ చేశారు. నిధులు రాక పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

March 6, 2026 / 04:28 PM IST

అంగన్వాడీ కేంద్రాన్ని కౌన్సిలర్ తనిఖీ

GDWL: గద్వాల 37వ వార్డులోని అంగన్వాడీ కేంద్రం-2ను కౌన్సిలర్ మంజుల కిరణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారం, విద్యా బోధనను పరిశీలించి, గర్భిణులు, బాలింతలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవం చేసుకోవాలన్న అవగాహన కల్పించాలని ఆమె కోరారు.

March 6, 2026 / 04:28 PM IST

డ్రంకన్ డ్రైవ్ కేసులో ఒకరికి జైలు శిక్ష

KMR: మద్యం తాగి వాహనం నడిపిన కేసులో ఒకరికి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ చంద్రశేఖర్ జైలు శిక్ష విధించినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. గురువారం భిక్కనూర్ శివారులో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా మద్యం తాగి వాహనాన్ని నడిపిన భాగిర్తిపల్లికి చెందిన స్వామిని నేడు కోర్టులో హజరుపరిచినట్లు వెల్లడించారు. జడ్జి అతనికి ఒక రోజు జైలు శిక్షతో పాటు రూ.1,000 జరిమానా విధించారు.

March 6, 2026 / 04:27 PM IST

జస్ప్రీత్ బుమ్రా@500

భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్ల అరుదైన మైలురాయిని చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో బ్రూక్ వికెట్ తీయడం ద్వారా బుమ్రా ఈ ఘనత సాధించాడు. ఈ మైలురాయిని చేరుకున్న 8వ భారత బౌలర్‌గా నిలిచాడు. టెస్టుల్లో 234, వన్డేల్లో 149, టీ20Iల్లో 117 వికెట్లు పడగొట్టాడు.

March 6, 2026 / 04:26 PM IST

బాధిత కుటుంబానికి దినేష్ రెడ్డి పరామర్శ

NLR: కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం ఎంపీటీసీ నాగరాజు కుటుంబ సభ్యులను రాష్ట్ర ఎన్విరాన్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోలం రెడ్డి దినేష్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఇటీవల ఎంపీటీసీ తనయుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఆయన పోతిరెడ్డిపాలెంలోని వారి నివాసానికి వెళ్లి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట పలువురు టీడీపీ నేతలు ఉన్నారు.

March 6, 2026 / 04:25 PM IST

డైవర్షన్ కోసమే ప్రగతి ప్రణాళిక: హరీష్ రావు

TG: 800 రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేక.. 99 రోజుల ప్రణాళిక పేరిట మరో డ్రామాకు తెరతీసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రెండున్నరేళ్ల పాలన తర్వాత ప్రగతి ప్రణాళికలు గుర్తుకు వచ్చాయా? అంటూ నిలదీశారు. అమలుకు నోచుకోని ఆరు గ్యారెంటీలు, పాలన వైఫల్యాలు, స్కాంల నుంచి దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మరో డైవర్షన్ ప్లాన్ అని మండిపడ్డారు.

March 6, 2026 / 04:25 PM IST

ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

E.G: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మీ రాజమండ్రిలోని ప్రభుత్వాసుపత్రిని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మానసిక చికిత్స విభాగంలో చికిత్స పొందుతున్న రోగుల వివరాలు, వైద్య సదుపాయాలు, తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మానసిక రుగ్మతల నుంచి పూర్తిగా కోలుకోవాలన్నారు.

March 6, 2026 / 04:24 PM IST

ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దుదాం

SDPT:  గ్రామాన్ని ప్లాస్టింగ్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రామ సర్పంచ్ భూక్య రాజేశ్వరి తిరుపతి నాయక్ పిలుపునిచ్చారు.  హుస్నాబాద్ మండలంలోని వంగరామయ్యపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పారిశుధ్యం పై గ్రామ ప్రజలకు, గ్రామ పంచాయతీ సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం రోడ్డుపై ఉన్న చెత్తను శుభ్రం చేశారు.

March 6, 2026 / 04:24 PM IST

తెలంగాణ ప్రజలు మోదీ పాలనను కోరుకుంటున్నారు: ఈటెల

NZB: తెలంగాణ ప్రజలు మోదీ పాలన కోరుకుంటున్నారని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. నిజామాబాద్ శివారులోని కమ్మ సంఘం భవనంలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ఆత్మీయ అభినందన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో భవిష్యత్ బీజేపీదేనని అన్నారు. నియంతృత్వ పాలన సాగించిన కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందన్నారు.

March 6, 2026 / 04:23 PM IST

BREAKING: మండలిలో పడిపోయిన బొత్స

AP: వైసీపీ ఎమ్మెల్సీ శాసన మండలిలో అస్వస్థతకు గురయ్యారు. మండలిలో మాట్లాడుతూ తూలి కిందపడిపోబోయారు. వెంటనే అప్రమత్తమైన మరో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వెంటనే ఆయన్ను పట్టుకున్నారు. అసెంబ్లీ అధికార వర్గాలు అత్యవసర వైద్యులను పిలిపించారు. బొత్సను పరీక్షించిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, బీపీ హెచ్చుతగ్గుల వల్ల అలా జరిగిందని తెలిపారు.

March 6, 2026 / 04:22 PM IST