• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

చెక్ బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష

MNCL: చెక్ బౌన్స్ కేసులో ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష, చెల్లించవల్సిన మొత్తం చెల్లించాలని జిల్లా జడ్జి నిరోష తీర్పునిచ్చారు. 2018లో జైపూర్ మండలంకి చెందిన నరసింహారెడ్డి వద్ద మంచిర్యాలకు చెందిన మధుసూదన్ రూ. 7.75 లక్షలు అప్పు చేశాడు. తిరిగి చెల్లించే క్రమంలో చెక్కు ఇవ్వగా అది బౌన్స్ అయ్యింది. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించగాపై విధంగా తీర్పునిచ్చారు.

February 26, 2026 / 08:02 AM IST

40 పాఠశాలలకు పీఎం శ్రీ నిధులు: కలెక్టర్

NZB: ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం 40 పాఠశాలలకు కింద మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. కలెక్టరేట్‌లో బుధవారం ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, రెసిడెన్షియల్ విద్యాసంస్థల హెచ్ఎంలు, ప్రిన్సిపల్స్‌తో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

February 26, 2026 / 08:01 AM IST

ఐదుగురు నకిలీ డాక్టర్ల అరెస్ట్

NLG: మిర్యాలగూడలో అర్హత లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతున్న ఐదుగురు నకిలీ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. 5 కంటి ఆసుపత్రిలో ఎలాంటి మెడికల్ సర్టిఫికెట్లు లేకుండా వీరు చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తనిఖీల్లో తేలింది. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి పూర్తి వివరాలను డీఎస్పీ రాజశేఖర్ వెల్లడించారు.

February 26, 2026 / 08:01 AM IST

జనసేన సభ్యత్వాల ఇన్‌ఛార్జ్‌గా కొరికాన భవాని

SKLM: పాతపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ సభ్యత్వాల ఇన్‌ఛార్జ్‌గా కొరికాన భవానిని పార్టీ అధిష్ఠానం బుధవారం నియమించింది. శ్రీకాకుళంలో నిర్వహించిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో సభ్యత్వాల నమోదు కోసం ఏడు నియోజకవర్గాలకు ఇంచార్జ్‌లను నియమించామని పార్లమెంట్ నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ రవికుమార్ తెలిపారు.

February 26, 2026 / 08:01 AM IST

నీతి ఆయోగ్ ప్రతినిధులను కలసిన కలెక్టర్

PPM: జిల్లా అభివృద్ధికి నీతి ఆయోగ్ పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కోరారు. నీతి ఆయోగ్ అధికార ప్రతినిధి ఆయుషి అగర్వాల్ బుధవారం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌ను కలసి జిల్లా సమగ్ర అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికపై వివరించారు.ఈ పర్యటనలో జిల్లా అధికారులు, నీతి అయోగ్ ప్రతినిధులు పాల్గొన్నారు.

February 26, 2026 / 08:00 AM IST

సోలార్ పథకాల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

NDL: జిల్లాలో అమలులో ఉన్న సోలార్ విద్యుత్ పథకాల పురోగతిని వేగవంతం చేయాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్లో APSPDCL అధికారులు, సోలార్ వెండర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో చేపట్టిన 9 పనుల్లో 4 పనులకు స్థలాలు ఖరారు కాగా, మిగిలిన పనులకు భూసేకరణను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.

February 26, 2026 / 08:00 AM IST

మార్చి 1న గురుకులాల్లో ప్రవేశాలకు పరీక్ష

KDP: అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్లో ప్రవేశాలకు మార్చి 1న పరీక్ష నిర్వహిస్తున్నట్లు గురుకుల విద్యాలయాల సమన్వయకర్త ఉదయశ్రీ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 5వ తరగతికి ఉదయం 9:30 నుంచి 11:30 గంటల వరకు, ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

February 26, 2026 / 08:00 AM IST

‘మార్కెట్ యార్డులో ఈ-నామ్ 2.0 అమలు’

KRNL: ఈనెల 25 నుంచి మార్కెట్ యార్డులో ఈ-నామ్ 2.0 ప్రక్రియను అమలు చేస్తున్నట్లు కార్యదర్శి ఆర్.జయలక్ష్మి బుధవారం తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్‌లతో మార్కెట్ కార్యాలయంలో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని కార్యదర్శి సూచించారు.

February 26, 2026 / 08:00 AM IST

పని ప్రదేశంలో మెడికల్ కిట్ తప్పనిసరిగా ఉండాలి: APO

VZM: పని ప్రదేశంలో నీరు, మెడికల్ కిట్ తప్పనిసరిగా ఉండాలని APO సాయిరాం సూచించారు. బుధవారం బాడంగి మండలం ఉపాధిహామీ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో ఆయన మాట్లాడుతూ.. ప్రతీ గ్రామ పంచాయతీలో పనులు కల్పించాలని,100 రోజుల ప్రగతి‌‌పైన FAలపైన దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు వేతన శ్రామికులతో దగ్గరుండి పని చేయించి దినసరి కూలీ 300 వచ్చే విధంగా చూడాలన్నారు.

February 26, 2026 / 08:00 AM IST

విదుర నీతి: ఈ ఇద్దరూ సూర్యుడిలా ప్రకాశిస్తారు

ఈ లోకంలో ఇద్దరు వ్యక్తులు సూర్యుడిలా ప్రకాశిస్తారని విదురుడు ధృతరాష్ట్రుడికి వివరించాడు. ‘ఎదుటివారిని శిక్షించే సామర్థ్యం ఉండి కూడా, కోపాన్ని అణచుకుని క్షమించే వ్యక్తి. అలాగే తన దగ్గర చాలా తక్కువ వనరులు ఉన్నా, ఇతరుల కష్టాన్ని చూసి చలించి తనకున్న దానిలోనే దానం చేసే పేదవాడు. ఈ ఇద్దరికీ దైవత్వం సిద్ధిస్తుంది, సమాజం వీరిని ఎప్పటికీ స్మరించుకుంటుంది’ అని విదురుడు చెప్పాడు.

February 26, 2026 / 08:00 AM IST

తిరుమల సమాచారం

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. 25 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.48 కోట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

February 26, 2026 / 07:59 AM IST

‘మిర్చి తడవకుండా చర్యలు తీసుకోవాలి’

WGL: ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి తడవకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి కే. సురేఖ సూచించారు. మార్కెట్‌లో మొత్తం 46 షెడ్లు ఉండగా, వాటిలో సుమారు 50 వేల నుంచి 80 వేల బస్తాల వరకు నిల్వ చేసే సామర్థ్యం ఉందని తెలిపారు. వర్షం సంభవించిన ధాన్యంపై కప్పుకునేందుకు పర్దాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

February 26, 2026 / 07:59 AM IST

ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన

KMM: ఖమ్మం పోలీస్ ప్రధాన కార్యాలయంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన సదస్సులో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై కీలక సూచనలు చేశారు. ప్రమాదాల నివారణకు ప్రతి డ్రైవర్ క్రమశిక్షణతో వ్యవహరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

February 26, 2026 / 07:56 AM IST

3,887 ఎకరాల్లో పంట నష్టం

సిద్దిపేట జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు 40 గ్రామాల్లోని 1,998 మంది రైతులు నష్టపోయారు. మొత్తం 3,887 ఎకరాల్లో మొక్కజొన్న (2,356 ఎకరాలు), సన్ఫ్లవర్ (1,531 ఎకరాలు)పంటలు దెబ్బతిన్నాయి.తొగుట మండలంలో డీఏవో స్వరూప రాణి క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని పరిశీలించారు. ఈ నివేదికను కలెక్టర్కు సమర్పించి, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బాధితులను ఆదుకుంటామని తెలిపారు.

February 26, 2026 / 07:49 AM IST

‘పరిశుభ్రతను పాటించడం మన బాధ్యత’

NLR: కలిగిరి మండల పరిధిలోని గ్రామ పంచాయతీలకు బుధవారం చెత్త సేకరణ బండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడం, సమర్థవంతమైన పారిశుధ్య నిర్వహణ కోసం ఈ బండ్లు, డస్ట్ బిన్లు అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. స్వచ్ఛమైన గ్రామాల నిర్మాణానికి పంచాయతీల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.

February 26, 2026 / 07:48 AM IST