• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల బీమా’

త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ ఎన్నికల్లో పోటీకి వ్యూహప్రతివ్యూహాలు సాగిస్తున్నాయి. తాజాగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్థానికంగా పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దేశ రాజధానిలోని ఆటో డ్రైవర్లకు రూ.10 లక్షల బీమా, వారి కుమార్తెల వివాహానికి రూ.లక్ష సాయం వంటి హామీలను ప్రకటించారు. కాగా, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ ఇప్పటివరకు 31 మంది అభ్యర్థ...

December 10, 2024 / 04:14 PM IST

ఈనెల 14న గోరక్షకులు ఆత్మీయ కలయిక

VZM: ఈనెల 14న విజయనగరంలో జరగనున్న గో రక్షకుల ఆత్మీయ కలయికను జయప్రదం చేయాలని గో సంరక్షణ సమైఖ్య రాష్ట్ర అధ్యక్షులు లోగిశ రామకృష్ణ అన్నారు. బొబ్బిలిలో గో రక్షకులు కలయికకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. రామకృష్ణ మాట్లాడుతూ.. విజయనగరం అయ్యన్నపేట జంక్షన్ వద్ద గల నల్లమారమ్మ తల్లి గుడి వెనుక ఉన్న తోటలో జరుగుతుందన్నారు.

December 10, 2024 / 04:13 PM IST

విద్యార్థులంతా పబ్లిక్ పరీక్షకు సన్నద్ధం కావాలి

SKLM: సీతంపేట మండలం పెదపొల్ల ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలను డిప్యూటీ డీఈవో నారాయుడు మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించారు. అనంతరం రికార్డులను పరిశీలించి, సంతృప్తికరం వ్యక్తం చేశారు. విద్యార్థులంతా పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. అందరికీ శుభాకాంక్షలు ముందుగా తెలిపారు.

December 10, 2024 / 04:12 PM IST

కోర్టు బోనెక్కిన ఇజ్రాయెల్ ప్రధాని

దశాబ్దాల రాజకీయ జీవితంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు తొలిసారి కోర్టు బోనెక్కారు. అతనిపై మోసం, నమ్మకద్రోహం, అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. అయినప్పటికీ విచారణకు హాజరయ్యారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో మొదటి సారి కోర్టు మెట్లెక్కడం తొలిసారి కావడం విశేషం.

December 10, 2024 / 04:11 PM IST

బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారిగా గుండేటి సునీత

JGL: బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారినిగా బాధ్యతలు స్వీకరించిన గుండేటి సునీతను బీసీ సంఘం నాయకులు మంగళవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బ్రహ్మాండభేరి నరేష్, యువజన అధ్యక్షుడు ముఖేష్ ఖన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ వొంటిపులి రాము, తదితరులు పాల్గొన్నారు.

December 10, 2024 / 04:09 PM IST

టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు

సత్యసాయి: సోమందేపల్లి మండలం చల్లాపల్లిలో మంగళవారం మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన కురు మారుతీకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ మాజీ సమన్వయకర్త బాబురెడ్డి పాల్గొన్నారు.

December 10, 2024 / 04:09 PM IST

కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ వేమిరెడ్డి

NLR: జిల్లాలో మత్య్సకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. కేంద్ర పంచాయితీరాజ్ శాఖ, మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్‌తో మంగళవారం భేటీ అయ్యారు. అనంతరం జిల్లాలో మత్య్సకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను వివరించారు.

December 10, 2024 / 04:08 PM IST

‘బాలికను హత్య కేసులో నిందితుని కఠినంగా శిక్షించాలి’

NDL: నందికొట్కూరు పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న అమ్మాయి లహరి ప్రేమాన్మాది చేతిలో మృతి చెందిన సందర్భంగా స్థానిక పటేల్ సెంటర్ నందు విద్యార్థులతో ర్యాలీగా వచ్చి శ్రద్ధాంజలి ఘటించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా పిడిఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జునైద్ బాషా మాట్లాడుతూ.. దేశంలోనూ అలాగే రాష్టంలోను అనేక చోట్ల నిత్యం మహిళతో పాటు బాలిక హత్య చేస్తున్న ఘటనలపై చర్యలు తీసుకోవాలి.

December 10, 2024 / 04:07 PM IST

ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరిస్తాం: మంత్రి అనగాని

BPT: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో MLC వేపాడ చిరంజీవితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల వద్ద అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

December 10, 2024 / 04:07 PM IST

వసతి గృహాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

ATP: వసతి గృహాల నిర్మాణ మరమ్మత్తు పనులు వచ్చే సంక్రాంతి లోపు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన విద్య అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

December 10, 2024 / 04:05 PM IST

ఆశాలపై పోలీసుల తీరు దుర్మార్గం: కేటీఆర్‌

TG: హామీల అమలుకు ఆశా వర్కర్లు ఆందోళన చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు.ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు ఆరు నెలల్లో అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు. ఉద్యోగ భద్రత, రూ. 18 వేల వేతన హామీ కోసం ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారని తెలిపారు. కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా సేవలందించారని కొనియాడారు. నిరసన తెలుపుతున్న ఆశా వర్కర్లపై పోలీసులు దాడులు చేయడం దుర్మార్గమన్నారు.

December 10, 2024 / 04:05 PM IST

నెలలో మూడున్నర కోట్ల విలువైన 1,100 ఫోన్లు రికవరీ

HYD: హైద్రాబాద్ మహానగరంలో దొంగతనాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ముఖ్యంగా మొబైల్ ఫోన్ దొంగతనాలకైతే లెక్కేలేదు. సైబరాబాద్‌లో ఈ 3, 4 నెలల్లో కొట్టేసిన ఫోన్ల విలువ దాదాపు మూడున్నర కోట్లు అని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. తాజాగా రికవరీ చేసిన 11 వందల ఫోన్లను మంగళవారం బాధితులకు అప్పగించారు. వీటి విలువ 3 కోట్ల 30 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.

December 10, 2024 / 04:03 PM IST

ప్రభుత్వ ఆక్రమిత భూమిలో హెచ్చరిక బోర్డులు

VZM: నెల్లిమర్ల మండలం ఒమ్మి గ్రామంలోని ఆక్రమిత ప్రభుత్వ స్థలంలో రెవెన్యూ అధికారులు మంగళవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గ్రామ పరిధిలోని లోతు గెడ్డ ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది ఆక్రమించినట్లు వచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ సుదర్శనరావు స్పందించారు. వెంటనే ఆక్రమణలు తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు.

December 10, 2024 / 04:03 PM IST

విద్యార్థులకు అస్వస్థత.. హరీశ్ రావు సీరియస్

TG: వికారాబాద్ తాండూరులోని గిరిజన గురుకుల పాఠశాల హాస్టల్‌లో విద్యార్థినులు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. విగ్రహాలపై ఉన్న ధ్యాస విద్యార్థులపై లేదని మండిపడ్డారు. సొంత జిల్లాలోని పాఠశాలలనూ CM నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులు చనిపోతున్నా.. మొద్దు నిద్ర వీడకపోవడం దుర్మార్గమన్నారు. CM నిర్లక్ష్యం వల్ల ఇంకెంతమంది ప్రాణాలు...

December 10, 2024 / 04:02 PM IST

చల్లపల్లిలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమం

కృష్ణా: స్థానిక సంస్థల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని చల్లపల్లి ఎంపీడీవో డాక్టర్ అనగాని వెంకటరమణ అన్నారు. మంగళవారం చల్లపల్లి మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమం కింద సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు శిక్షణ సదస్సు నిర్వహించారు.

December 10, 2024 / 04:01 PM IST