ఏలూరు: కలెక్టరేట్ కార్యాలయంలో మరియు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం యధావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నమన్నారు.
KMR: బీర్కూర్ మండలం బైరాపూర్ శ్రీ రేణుక ఎల్లమ్మ-జమదగ్ని మహర్షి కళ్యాణ మహోత్సవాలకు రంగం సిద్ధమైంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఈ వేడుకలు వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సోమవారం ఉదయం అమ్మవారి కళ్యాణం, మంగళవారం భక్తిశ్రద్ధలతో బోనాల ఊరేగింపు, బుధవారం భక్తులకు సామూహిక భోజన కార్యక్రమాలు ఉంటాయని పేర్కొన్నారు.
HNK: భీమదేవరపల్లి (M) మల్లారంలో ఇవాళ 11 కేవీ విద్యుత్ వైరు అకస్మాత్తుగా తెగి ఇతర వైర్ల పై పడటంతో షాక్‌కు గురై వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇంటి వద్ద పిండి మిషన్ నడుపుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
GDWL: బురద గుంతలతో ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం సొంత చొరవతో ఈ మరమ్మతులు చేపడుతున్నామని చిన్నోనిపల్లి సర్పంచ్ దేవేందర్ పేర్కొన్నారు. గట్టు మండలం చిన్నోనిపల్లి ఆర్ అండ్ ఆర్ (R&R) సెంటర్ పరిధిలో పాడైపోయిన రహదారులను ఆదివారం సర్పంచ్ ఆధ్వర్యంలో బాగు చేశారు. వర్షాల వల్ల, ఇతర కారణాల వల్ల గుంతలమయంగా మారిన రోడ్లను బాగుచేసారు.
AP: చిత్తూరు పర్యటనలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవుడితోనే వైసీపీ నీచ రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. దేవుడిపై భక్తి, హిందువుల మనోభావాలపై జగన్‌కు గౌరవం లేదన్నారు. చెప్పులు వేసుకుని వేంకటేశ్వరస్వామి ఫొటోలతో నిరసన తెలిపారని ఫైర్ అయ్యారు. టీటీడీ సంప్రదాయాలు, హిందూ విశ్వాసాలపై జగన్‌కు చిన్నచూపు అని విమర్శించారు.
KMM: కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్ర బడ్జెట్ లో గీత కార్మికుల సంక్షేమానికి రూ. 5వేల కోట్లు కేటాయించాలని KGKS రాష్ట్ర అధ్యక్షులు ఎం. వి రమణ డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా సంఘం కార్యాలయంలో బొడపట్ల సుదర్శన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికులకు ప్రతిసారి అన్యాయమే జరుగుతుందన్నారు.
TPT: సత్యవేడు(మం), ఇరుగుళంలో యువత, గ్రామస్తులు ఎంపీ మద్దెల గురుమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మార్చి 3న నిర్వహించనున్న అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలని ఆహ్వాన పత్రిక అందించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించి సానుకూలంగా స్పందించిన ఎంపీకి గ్రామస్తులు, స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
MDK: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజలు వాటిని సధ్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. వెల్దుర్తి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. రిజిస్టర్లు పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు చేయించుకునేలా గర్భీణులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.
NDL: జిల్లా కలెక్టరేట్ తో పాటు మండల డివిజన్ కేంద్రాలు మున్సిపల్ కార్యాలయాల్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉంటుందని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రజలు ఉత్తమ అర్జీలను ప్రత్యక్షంగా ఇవ్వడమే కాకుండా ఆన్ లైన్ ద్వారా కూడా సమర్పించవచ్చున్నారు.
BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో రేపు నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీవో రాహుల్ ఆదివారం తెలిపారు. గిరిజన దర్బార్కు రేపు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందచేయాలని కోరారు.
ATP: తాడిపత్రి మండలం వెలమకూరు పొలాల్లో పేకాటాడుతున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్పీ జగదీష్ ఆదేశాలతో సీఐ శివగంగాధర్ రెడ్డి నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. నిందితుల నుంచి రూ.72,980 నగదు, మూడు మోటార్ సైకిళ్లు, 11 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
CTR: పలమనేరు ఏరియా ఆసుపత్రిని జిల్లా స్థాయి ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు MLA అమర్నాథ్ రెడ్డి, MP దగ్గు మళ్ల ప్రసాద్ రావు సంయుక్తంగా ప్రకటించారు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో ఆదివారం 6000 లీటర్ల కెపాసిటీతో ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ హీటింగ్ సిస్టంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వార్డులను వారు పరిశీలించారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు లక్షెట్టిపేట పట్టణంలో పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట పట్టణ, మండల అధ్యక్షులు ఎండీ. ఆరిఫ్, పింగళి రమేష్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాల, కళాశాలలను సందర్శిస్తారన్నారు. ఆ కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొనాలన్నారు.
KRNL: ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మాచాని శివ కేశవ “అత్యంత చిన్న నాటికల్ నాట్ బోర్డ్ తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఈ సందర్భంగా ఆయన గురువు చంద్రశేఖర్‌తో కలిసి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డిని కలిశారు. ఆదివారం ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. యువతకు స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు.
PPM: అర్జీల వివరాలు మీ కోసం వెబ్‌సైట్‌లో నమోదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సమర్పించిన అర్జీల స్థాయిని 1100 టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అన్ని కార్యాలయాల్లో ప్రజల సమస్యలు సోమవారం స్వీకరించడం జరుగుతుందన్నారు.