NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి జి.ప.ఉ. పాఠశాలకు విద్యార్థుల సౌకర్యార్థం క్యూరియా గ్లోబల్ సంస్థ రూ.2.25 లక్షల విలువైన 11 టేబుళ్లు, 10 కుర్చీలు, 10 ర్యాక్‌లను ఆదివారం అందజేసింది. ఈ పాఠశాల పూర్వ విద్యార్థి, క్యూరియా సైంటిస్ట్ డా. ఆవుల రాఘవేందర్ చొరవతో సీఎస్ఆర్ నిధుల ద్వారా ఈ సహాయం అందింది. కంపెనీ బృందానికి, రాఘవేందర్‌కు హెచ్‌ఎం కృతజ్ఞతలు తెలిపారు.
WNP: వనపర్తి నియోజకవర్గం కన్మనూరు గ్రామానికి చెందిన మీనిగ బాలయ్య నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరిగిపోయింది.ఆదివారం కన్మనూరు గ్రామానికి వెళ్లిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్యను పరామర్శించి ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు. ఇబ్బంది ఏమీ లేదని తనకు భరోసాగా నేనుంటానని ఎమ్మెల్యే బాధితుడికి ధైర్యం చెప్పారు.
NZB: ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ హైయర్ సెకండరీ స్కూల్ (బాలుర)లో 1975 -76లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 50 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనంలో కలిశారు. పట్టణంలో గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 50 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట కలిసి పాత రోజుల్లో జరిగిన విద్యాభ్యాసం గురించి చర్చించుకున్నారు.
TG: ములుగు జిల్లాలోని దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా భూసేకరణ కోసం జూన్ 2వ తేదీలోపు రూ. 600 కోట్లు మంజూరు చేస్తామని CM రేవంత్ రెడ్డి చెప్పారు. శాసనసభ బడ్జెట్ సమావేశాలలోపు అన్ని అంచనాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని ప్రాజెక్టుల భూసేకరణ కోసం ప్రత్యేక కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేసి.. భూములు కోల్పోయిన వారికి గ్రీన్ ఛానెల్‌లో నిధులు మంజూరు చేస్తామన్నారు.
విశాఖ సాగర్‌నగర్‌లోని ఇస్కార్ మందిరంలో ఆదివారం “హరే కృష్ణ, హరే రామ” నామస్మరణతో భక్తి వాతావరణం నెలకొంది. వారాంతపు ప్రత్యేక పూజల సందర్భంగా ఇస్కాన్ అధ్యక్షులు సాంబాదాస్ ప్రభూజీ, మాతాజీ నితాయి సేవిని భగవద్గీత శ్లోకాలతో పాటు ఆధ్యాత్మిక ప్రవచనాలు అందించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణులు, సుభద్రా దేవి, బలభద్రుడు, జగన్నాథుడు, సీతారాములను అలంకరించారు.
NRKL: ఉప్పునుంతల మండల కేంద్రంలో ఆదివారం బీరప్ప స్వామి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. డప్పు వాయిద్యాల మధ్య మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో ఊరేగి స్వామివారికి మొక్కులు చెల్లించారు. ప్రధాన రహదారులన్నీ భక్తులతో కిటకిటలాడగా, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేసారు.
MHBD: గార్ల మండలం పూమ్యతండాలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన గూగులోత్ రవి (32) భార్యతో గొడవపడి, మనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురికి దర్యాప్తు చేపట్టారు.
కోనసీమ: రాజోలు నియోజకవర్గంలో 30 వేల జనసేన సభ్యత్వాలే లక్ష్యంగా పనిచేయాలని MLA దేవ వరప్రసాద్ సూచించారు. విశ్వేశ్వరాయపురం క్యాంపు కార్యాలయంలో ఆదివారం పార్టీ సభ్యత్వ నమోదుపై సమావేశం నిర్వహించారు. సభ్యత్వం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని, ఈ కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
PDPL: జూలపల్లి మండలం తేలుకుంట గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, శివాలయంలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం, శివాలయంలో కలశ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ సంపత్, పార్టీ నాయకులు ఎమ్మెల్యేను సత్కరించారు.
కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 20వ డివిజన్లోని రాజారెడ్డి కాలనీలో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఏన్నికైంది. కాలనీ అభివృద్ధి, శుభ్రత, మౌలిక వసతుల మెరుగుదల, సామాజిక ఐక్యతను లక్ష్యంగా చేసుకొని కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా భాస్కర్, కార్యదర్శిగా విద్యాకర్, కోశాధికారిగా సంతోశ్ ఎన్నికయ్యారు.
SRPT: కోదాడ పట్టణానికి చెందిన చిత్రపు అన్నపూర్ణమ్మ (105) వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు ‘శతాధికా సంబరాలు’ నిర్వహించారు. నేటికీ ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. అన్నపూర్ణమ్మ తన జీవితకాలంలో ఐదు తరాలను మనుమలు, మునిమనుమలు చూసి ఆశీర్వదించారు. ఆదివారం కోదాడ పట్టణంలో కుటుంబ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు.
VZM: దేశంలో బీజేపీ మత విద్వేషాలను సృష్టిస్తోందని సీపీఐ రాష్ట్ర నాయకుడు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ ఆరోపించారు. విజయనగరం అమర్ భవన్లో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నాయకులు చేస్తున్న అకృత్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు.
ASR: కొయ్యూరు మండలంలోని రాజేంద్రపాలెం వారపు సంతను ఆదివారం కొయ్యూరు సీఐ బీ.శ్రీనివాసరావు, ఎస్సై పీ.కిషోర్ వర్మ, మంప ఎస్సై శ్రీనివాస్ సందర్శించారు. వారపు సంతకు వచ్చిన మారుమూల గ్రామాల గిరిజనులతో సమావేశం నిర్వహించారు. రహదారి భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని సూచించారు. వాహన రికార్డులను సక్రమంగా కలిగి ఉండాలన్నారు.
BHNG: ఆత్మకూరు మండలం రాయిపల్లి గ్రామంలో ఆదివారం శ్రీ ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలకు ఉచితంగా జనరల్బి ఫిజీషియన్ డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్ డాక్టర్ రాజ్ కుమార్ చే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, న్యూరోపతి, బిఎండి పరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు.
AP: ఎల్లుండి ఛలో విజయవాడకు మున్సిపల్ కార్మికులు పిలుపునిచ్చారు. 12వ PRC కమిషన్ ఏర్పాటు, జీతాలు పెంచాలని, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్‌తో కార్మికులు ధర్నా చేయనున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.