SRCL: ఈ నెల 15 వ తేదీలోగా పెండింగ్ సీఎంఆర్ ఇవ్వాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఖరీఫ్, రబీ 2023-2024 సీజన్ సీఎంఆర్ ఇవ్వడం, ఖరీఫ్ 2024-25 సీజన్ ధాన్యానికి సంబంధించి బ్యాంక్ గ్యారంటీ అందజేయడంపై జిల్లాలోని బాయిల్డ్, రా రైస్ మిల్లర్లతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్ తో కలిసి సమావేశం నిర్వహించారు.
VZM: నగర పంచాయతీ, మండల పరిధిలోని అన్ని సచివాలయాల్లో పూర్తిస్థాయిలో నిఘా పెట్టాలని మహిళా పోలీసులకు ఎస్సై బి గణేష్ సూచించారు. స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బహిరంగ మద్యపానం, గంజాయి విక్రయాలు, వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని కోరారు.
కృష్ణా: గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సీఐ నాగదుర్గ ప్రసాద్ మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ కళాశాల రోడ్డులో ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారి కుమార్తె కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చారన్నారు. కిడ్నాప్ కేసుగా రిజిస్ట్రేషన్ చేసి, తల్లిదండ్రులు అనుమానిస్తున్న వ్యక్తి కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. త్వరలో నిందితుడిని అదుపులోకి తీ...
జోగులాంబ గద్వాల జిల్లా మండల కేంద్రమైన కేడిదొడ్డిలో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల భవనాన్ని మంగళవారం గద్వాల వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ నల్ల హన్మంతు ప్రారంభించారు. 2017లో కేటిదొడ్డి మండలానికి పాఠశాల మంజూరు కాగా.. భవనం లేకపోవడంతో ర్యాలంపాడు శివారులోని ప్రభుత్వ సముదాయ భవనంలో కొనసాగిస్తున్నారు.
కృష్ణా: కంకిపాడులో మంగళవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం అయన మాట్లాడుతూ.. మండలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు తాను కృషి చేస్తానన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సహకారం కావాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నేర్సు రాజలక్ష్మి, ఎంపీడీవో పాల్గొన్నారు.
SKLM: అదాని గ్రూప్ కంపెనీల అవినీతి, తప్పిదాలు, ప్రోత్సాహించడంలో కేంద్ర ప్రభుత్వ పాత్రపై దర్యాప్తు చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం సీపీఐ నాయకులు బి.శ్రీరామూర్తి ఆధ్వర్యంలో శ్రీకాకుళం పాత బస్టాండ్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి, నిజ నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు.
VZM: దత్తిరాజేరు మండలం పెదమానాపురం పశువులు సంతలో జరుగుతున్న అక్రమ రవాణా పై చర్యలు చేపట్టాలని, కేసులు నమోదు చేయాలని బొబ్బిలి రెవిన్యూ డివిజన్ అధికారి రామ్మోహనరావు సూచించారు. బొబ్బిలి తన కార్యాలయంలో మంగళవారం జంతు సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించారు. జంతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చట్టాలు చేసిందని వాటి అమలుకు అధికారులు కృషి చేయాలన్నారు.
కృష్ణా: ఎ.కొండూరు మండలంలోని పాత కొండూరు పెద్దబీడులో దళితులు సాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు ఇచ్చి ఆన్ లైన్‌లో పేర్లు నమోదు చేయాలని కోరుతూ.. మండల సీపీఎం ఆధ్వర్యంలో దళితులు కొండూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ నెల 7న జరిగిన రెవెన్యూ సదస్సులో దళితులు తహశీల్దార్ ఆశయ్యకు వినతి పత్రం అందజేసినట్లు మండల సీపీఎం పార్టీ కార్యదర్శి పానెం తెలిపారు.
GNTR: మంగళగిరి మండలం ఆత్మకూరులో మాజీఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన వంగవీటి విగ్రహానికి భూమి పూజ చేశారు.
ADB: హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించే దగాపడ్డ కళాకారుల డప్పుల మోత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ధూంధాం కళాకారులు లింగంపల్లి రాజలింగం కోరారు. మంగళవారం జన్నారం మండల కేంద్రంలో మాజీ ఎంపీపీ మచ్చ శంకరయ్యతో కలిసి పోస్టర్‌ను విడుదల చేశారు. డిసెంబర్ 12, 13వ తేదీలలో హైదరాబాదులోని ఎస్వీకేలో కళాకారుల కార్యక్రమం ఉంటుందన్నారు.
డిసెంబరు 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య మూడో టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ తుది జట్టులో రెండు మార్పులు ఉంటాయని అంచనా వేశాడు. అశ్విన్, హర్షిత్ రాణాలను పక్కనపెట్టి వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణలను తుది జట్టులోకి తీసుకుంటారని తెలిపాడు.
AP: సీఎం చంద్రబాబుతో వంగవీటి రాధ భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు చర్చించారు. వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీంతో సీఎం చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది.
AP: వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామ కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటామని అన్నారు. దీనిలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాడాల్సిన సమయం వచ్చిందని పార్టీ నేతలకు సూచించారు.
ASR: డుంబ్రిగుడ మండలంలో జంగిడివలస, అడ్రగూడ జాంగూడ గ్రామాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ అరకు నియోజవర్గం నాయకురాలు సుజాత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పిల్లలకు పలు పోటీలను నిర్వహించి గెలుపొందిన పిల్లలకు బహుమతులను అందజేశారు.
TG: వికారాబాద్ జిల్లాలో ఆహారం కలుషితమై 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన తాండూరులోని గిరిజన గురుకుల పాఠశాల హాస్టల్‌లో చోటుచేసుకుంది. అస్వస్థతకు గురైన విద్యార్థులకు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.