• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘టీపీ కోట రోడ్డు మంజూరుకు కృషి చేస్తా’

TPT: నాగలాపురం-చిన్న పాండూరు (వయా టీపీ కోట) రోడ్డు పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం స్పష్టం చేశారు. మంగళవారం నాగలాపురంలో ఎమ్మెల్యే పర్యటించారు. అవసరమైతే టీపీకోట రోడ్డు ఆవశ్యకతను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్ళి పనులు చేపట్టడానికి కృషి చేస్తానన్నారు.

December 10, 2024 / 04:27 PM IST

వేర్వేరు కేసులలో నిందితుల అరెస్టు

ELR: జిల్లాలో వేరు వేరు కేసుల్లో నిందితులుగా ఉన్న 4 ముఠా సభ్యులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఎస్పీ ప్రతాప కిషోర్ మాట్లాడుతూ.. నిందితుల వద్ద 70 లక్షల విలువైన బంగారం వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. నేరాల విశ్లేషణలో జిల్లా పోలీస్ టీమ్ చాలా బాగా పనిచేస్తుందన్నారు. ఇంటికి తాళాలు వేసి బయటకు వెళ్ళేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

December 10, 2024 / 04:26 PM IST

మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ ముట్టడికి విద్యార్థి సంఘాల యత్నం

TG: తెలంగాణ విద్యార్థి బీసీ సంఘం ఆధ్వర్యంలో మినిస్టర్స్‌ క్వార్టర్స్‌ ముట్టడికి ప్రయత్నించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విషయంలో ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ ముట్టడి చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థులను పోలీసులు అడ్డుకొని.. వారిని బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

December 10, 2024 / 04:25 PM IST

పొదిలిలో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

ప్రకాశం: పొదిలి మండలం అడ్డరోడ్డు సమీపంలో ఒక గృహంలో భారీగా రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, రెవెన్యూ అధికారులు దాడి చేసి అక్రమంగా నిల్వచేసిన 300 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వచేసిన విషయంపై అధికారులు విచారిస్తున్నారు.

December 10, 2024 / 04:24 PM IST

సేవా భూషణ్ అవార్డు అందుకున్న గుంతకల్లు వాసి

ATP: గుంతకల్లుకు చెందిన ప్రాణదాత సేవా సమితి అధ్యక్షుడు హనుమంతు మంగళవారం కాకినాడలోని డీ.కన్వెన్షన్ హాల్‌లో నిర్వహించిన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా సేవా భూషణ్ అవార్డును అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. యాచకులకు అన్నదానం, మూగజీవాలకు ఆహారం అందించడంతో పాటు రక్తదానం, పలు సేవా కార్యక్రమలను గుర్తించి సేవా భూషణ్ అవార్డును అందించడం సంతోషంగా ఉందన్నారు.

December 10, 2024 / 04:23 PM IST

బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై చర్యలకు ఫిర్యాదు

కృష్ణా: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించి, చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గంపలగూడెం జనసేన నాయకులు ఫిర్యాదు చేశారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో జనసేన మండల ప్రధాన కార్యదర్శి వట్టికుంట కృష్ణ ఆధ్వర్యంలో జనసైనికులు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.

December 10, 2024 / 04:23 PM IST

తెలంగాణ జాగృతిలోకి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్

కామారెడ్డి: జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సంపత్ గౌడ్ మంగళవారం ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత పిలుపు మేరకు జాగృతిలో చేరినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ సంపత్ గౌడ్ చేరారు.

December 10, 2024 / 04:22 PM IST

అంగన్వాడి కార్యకర్తల సమావేశం

SKLM: మందస మండల కేంద్రంలో గల ప్రాజెక్టు కార్యాలయంలో ఐసీడీఎస్ సీడీపీవో వసుంధర దేవి ఆధ్వర్యంలో సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలంతా సమయపాలన పాటించాలని సూచించారు. అదేవిధంగా గర్భిణులకు, బాలింతలకు తప్పనిసరిగా నిబంధనల ప్రకారం కిట్లను పంపిణీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అంగన్వాడీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

December 10, 2024 / 04:20 PM IST

మూడు నెలలకు ఒకసారి ఈవీఎంల పరిశీలన

SRD: 3నెలలకు ఒకసారి ఈవీఎంలను పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. మంగళవారం పాత డీఆర్డీఏలోని ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించినట్లు చెప్పారు. స్ట్రాంగ్ రూమ్‌లో సీసీ కెమెరాలు, విద్యుత్ లైట్లు, తదితర సౌకర్యాలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఈవీఎంలకు పోలీసుల భద్రత కల్పించినట్లు చెప్పారు.

December 10, 2024 / 04:20 PM IST

సాగునీటికి ఎన్నికల శిక్షణా కార్యక్రమం

SKLM: సరుబుజ్జిలి మండలం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో పావని, ఎమ్మార్వో మధుసూదన్ రావు ఆధ్వర్యంలో సాగునీటి వినియోగదారుల సంఘ ఎన్నికలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. మంగళవారం డీఈ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం నియమ నిబంధనలు ప్రకారం సాగునీటి ఎన్నికలపై ఊర్లలో దండోరా వేయించి ప్రజలకు తెలియజేయాలని అన్నారు.

December 10, 2024 / 04:20 PM IST

‘పాఠశాలలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి’

అన్నమయ్య: జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసి సిబ్బంది కొరతను పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో అనేక సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.

December 10, 2024 / 04:19 PM IST

విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఎంపీడీవో

ELR: 10వ తరగతిలో ప్రణాళిక బద్ధంగా చదివితే ఉత్తీర్ణత సాధించుటకు కష్టమైన పని కాదని, ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు ఇచ్చిన వందరోజుల ప్రణాళికలను ఫాలో అవుతూ ప్రిపరేషన్ కొనసాగించాలని ఉంగుటూరు ఎంపీడీవో జిఆర్ మనోజ్ 10వ తరగతి విద్యార్థులకు సూచించారు. మంగళవారం సాయంత్రం బాదంపూడి జిల్లా పరిషత్ హైస్కూల్‌ని సందర్శించి పిల్లలతో సంభాషించారు.

December 10, 2024 / 04:19 PM IST

హైడ్రా కమిషనర్‌‌ను కలిసిన బీజేపీ ఎమ్మెల్యే

TG: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కలిశారు. చెరువులు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని తెలిపారు. చెరువుల కబ్జాపై రెండు నెలల క్రితమే చెప్పానని వెల్లడించారు. అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇచ్చింది ఎవరని, వారిపై చర్యలేవని ప్రశ్నించారు. తప్పు చేసిన అధికారులు ఎవరైనా శిక్షార్హులేనని పేర్కొన్నారు.

December 10, 2024 / 04:19 PM IST

రైతు భరోసా కేంద్రాలను తనిఖీ చేసిన జేసీ

KKD: దాన్యం కొనుగోలులో రైతుల బిల్లులు చెల్లింపునకు సంబందించిన ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ (ఎఫ్డీవో)లను సకాలంలో అందించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ భావన ఆదేశించారు. మంగళవారం సామర్లకోట మండలం ఉండూరు, వీకే రాయపురం గ్రామాల్లో రైస్ మిల్లులు, రైతు భరోసా కేంద్రాలను ఆమె తనిఖీ చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియ గురించి అడిగి తెలుసుకున్నారు.

December 10, 2024 / 04:18 PM IST

బైక్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు

SKLM: శ్రీకాకుళం పట్టణం మిడి కవర్ వద్ద శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసులు మంగళవారం వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో ఇటీవల దొంగలించబడిన నాలుగు బైకులతో పాటు నిందితులు పట్టుకోవడం జరిగిందని సీఐ ఈశ్వరరావు తెలిపారు. వాళ్ళు ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందినవారుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

December 10, 2024 / 04:17 PM IST